Monday, August 21, 2017

Convert English to Telugu online easily




తెలుగులో టైపింగ్ చెయ్యడం అంత సులభం కాదు 



  కానీ ఆన్లైన్ లో తెలుగు టైపింగ్ చేయడం చాలా సింపుల్ 





కొన్ని వెబ్సైట్లు మనం ఇంగ్లీష్ లో టైపు చేసిన పదాలను వెంటనే తెలుగు  లోకి మార్చేస్తాయి , అలాంటి వెబ్సైట్లు క్రింద ఇవ్వడం జరిగింది . వెంటనే ట్రై చేయండి మరి 



1.Telugu Changathi

2. Tamil Cube

3. Telugu Typing

4. Lekhini

5. Andhra Bharati



ఈ వెబ్సైట్లు ఉపయోగించి చాలా సులభంగా తెలుగు లో టైపు చేయొచ్చు 










Tuesday, July 11, 2017

జియో ప్రవేశపెట్టిన కొత్త ప్లాన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి



జియో summer surprise ఆఫర్ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. తన కస్టమర్స్ కు జియో మరొకసారి తన నూతన ఆఫర్స్ తో ఒక surprise ఇచ్చింది. 
జియో తన పాత ప్లాన్స్ లో కొన్ని మార్పులు చేసి క్రొత్తగా రెండు ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది . 
జియో యూజర్లు కు ఇది మంచి వార్త . 
ప్లాన్ వివరాలు అన్ని క్రింద ఇవ్వడం  జరిగింది .. 







మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్స్ లో తెలియజేయగలరు 



Thursday, February 9, 2017

Best Site to Download all Softwares freely and Safely

కంప్యూటర్ కి సంబంధించిన softwares free గా  డౌన్లోడ్ చేసుకోవటానికి చాలా websites అందుబాటులో ఉన్నాయి , కానీ softwares తో  పాటు వైరస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. 
ఇప్పుడు చెప్పబోయే website  లో ఇలాంటి  సమస్యలు ఉండవు. 

చాలా వెబ్సైట్లు పరిశీలించిన తర్వాత ఈ వెబ్సైట్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. 

"GET INTO PC"

Address : www.getintopc.com
ఈ వెబ్సైట్ లో అన్ని రకాల windows OS ISO files , Graphic Design , 3D CAD , Multimedia , Development , Antivirus , Education కి సంబంధించి softwares ఫ్రీ గా డౌన్లోడ్ చేస్కోవచ్చు .


ఆలస్యం ఎందుకు  ట్రై చేయండి 

Share to all

Wednesday, February 1, 2017

How To Use Pendrive As Ram In Windows?






Pendrive ను ఉపయోగించి కంప్యూటర్ యొక్క రామ్ ను కొంతవరకు పెంచవచ్చు. 
దీనినే virtual ram అని అంటారు . 
అది ఎలాగో ఇప్పుడు చూద్దాం . 

Method 1:

1)pendrive ని కంప్యూటర్ కి కనెక్ట్  చేయండి. 

2)My Computer ఓపెన్ చేసి pendrive మీద right click cheyandi 

3)Properties మీద క్లిక్ చేయండి 

4)ఇప్పుడు ready boost అనే option కనిపిస్తుంది 


5)Ready Boost మీద క్లిక్ చేయండి 

6)తరువాత use this device అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి 

7)మీరు కనెక్ట్ చేసిన pendrive కెపాసిటీ ని బట్టి అక్కడ arrow marks మీద క్లిక్ చేసి ఎంత memory ని ram లాగా వాడుకోవాలో సెట్ చేయండి 

8)last గా Apply ని క్లిక్ చేసి next ఓకే మీద క్లిక్ చేయండి. 

9)ఇప్పుడు మీరు మీ pendrive ని virtual రామ్ లాగా వాడుకోవచ్చు 

గమనిక :

Pendrive  ని తీసేముందు Safely remove అనే ఆప్షన్ నొక్కి తీయటం మంచిది. 














Tuesday, December 27, 2016

Reasons for Redmi Note 3 is the best mobile in 2016

Redmi Note 3 

2015 నవంబర్ లో రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందో తెలిపే కొన్ని కారణాలు ఇప్పుడు చూద్దాం . 

కారణాలు :-

1)5.5 inch డిస్ప్లే 
పెద్ద స్క్రీన్ ఉండటం వల్ల అన్ని పనులు సులువుగా చేస్కోవచ్చు . 
వీడియోస్ చూడటానికి మరియు గేమ్స్ ఆడటానికి చాల బాగుంటుంది . 

2)4050 mAh బ్యాటరీ 
ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ ఇవ్వడం వల్ల ఛార్జింగ్ బాధలు తప్పినట్టే . 

3)4G Volte Enabled
4g volte ఉండటం వల్ల హైస్పీఎడ్ ఇంటర్నెట్ మరియు బెటర్ వాయిస్ క్లారిటీ పొందవచ్చు . 

4)Finger Print Scanner
ఫోన్ ను ఫాస్ట్ గా లాక్ తీయడానికి ఫింగర్ ప్రింట్ స్కానర్ చాల బాగా ఉపయోగపడుతుంది. 

5)16 MP Back & 5 MP Front Camera
16 MP కెమెరా తో మంచి క్వాలిటీ తో ఫొటోస్ తీసుకోవచ్చు . అలాగే 5 MP ఫ్రంట్ కేమెరా తో మంచి సెల్ఫీస్ తీసుకోవచ్చు . 

6)IR Blaster (infrared remote control)
ఈ ఆప్షన్ వల్ల ఫోన్ ను రిమోట్ కంట్రోలర్ లాగా వాడొచ్చు. T.V,A.C,DVD player మొదలగు వాటిని కంట్రోల్ చేయొచ్చు . 

7)3gb/2gb Ram
3gb ర్యామ్ /2gb ర్యామ్ ఉండటం వల్ల మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు హ్యాంగ్ అవ్వడం అనే సమస్య ఉండదు . 

8)rs.12,000/rs.10,000
3gb ram మరియు 32 gb ఇంటర్నల్ మెమరీ ఉన్న మోడల్ రూ . 12,000/.. 
2gb ram మరియు 16 gb ఇంటర్నల్ మెమరీ ఉన్న మోడల్ రూ . 10,000/.. 


Final Verdict:-
ఇదే ధరలో వేరే ఇతర కంపెనీల ఫోన్లు ఉన్నప్పటికీ వాటిలో కావలసిన features అన్ని లేకపోవటంతో Redmi Note 3 నే ది బెస్ట్ గా నిలిచింది. 



గమనిక :-
మీ సలహాలు మరియు సూచనలు కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు 
ధన్యవాదాలు 







Saturday, December 24, 2016

How to get AP FIBERNET connection?






ఏ.పీ ఫైబర్నెట్ కనెక్షన్ పొందడానికి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించటం ప్రారంభించారు. 
కనెక్షన్ పొందగోరువారు http://www.apsfl.in/ వెబ్సైట్ లో మీ వివరాలు సమర్పించి అతి త్వరలో కనెక్షన్ ను పొందగలరు. 

ప్లాన్ వివరాలు :-